బిగ్ బాస్ ఆదిరెడ్డికి మూవీ ఆఫర్...ఆయన వైఫ్ కి బిగ్ బాస్ ఆఫర్!
on Oct 12, 2024
బిగ్ బాస్ ఆదిరెడ్డి గురించి తెలియని వారెవరూ ఉండరు. బిగ్ బాస్ రివ్యూస్ తో బాగా పాపులర్ అయ్యాడు. అలాగే వాళ్ళ సోదరి నాగలక్ష్మి వీడియోస్ తో కూడా బాగా పేరు సంపాదించారు. బిగ్ బాస్ రివ్యూస్ తో ఫేమస్ ఐన ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది. ఆ షోతో స్టార్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఫైనల్ కి వరకు వెళ్లి వచ్చాడు. అలాంటి ఆదిరెడ్డి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో తన ఫాన్స్ తో చిట్ చాట్ చేసాడు.
ఐతే ఒక అభిమాని ఇలా అడిగాడు "మూవీస్ లో ట్రై చేస్తున్నారా..ఏవన్నా ఆఫర్స్ వస్తున్నాయా" అని అడిగాడు.. దానికి ఆదిరెడ్డి "ఒక ఆఫర్ ఉంది..త్వరలో రివీల్ చేస్తాను..నేను చెప్పకపోయినా మీరే చూస్తారు" అని చెప్పాడు. అలాగే మరో అభిమాని "కవిత అక్కకు బిగ్ బాస్ ఛాన్స్ వస్తే పంపిస్తారా" అని అడిగేసరికి "హా రావోచ్చనుకుంటా త్వరలో" అంటూ తన భార్యకు కూడా బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ రావొచ్చు అని చెప్పాడు. అలాగే చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ ఇలా ఇచ్చాడు " తన వయసు 34 అని బిబీ 6 కంటెస్టెంట్స్ అందరితో టచ్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు." ఆదిరెడ్డి.
Also Read